India vs South Africa 1st ODI: Rain May Take Lead In Series Opener Match | Oneindia Telugu

2020-03-12 166

India vs South Africa 1st ODI: Another series-opener match India and South Africa could be abandoned due to rain. Last year, the first T20I of three-match series India vs South Africa had suffered a similar in Dharamshala.
#IndiavsSouthAfrica1stODI
#Matchabandonedrain
#Coronavirus
#livecricketscore
#viratkohli
#KLRahul
#HardikPandya
#klrahul
#DharamshalaWeatherForecast

ఈ సారి వాతావరణమూ అనుకూలంగా లేదు. మంగళవారం రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడింది. బుధవారం జట్ల సాధన ముగిసిన వెంటనే మళ్లీ మొదలైంది. గురువారం వర్షం కురిసినా రెండు గంటల్లో మైదానాన్ని సిద్ధం చేయగలం. ఆ సామర్థ్యం ఈ మైదానానికి ఉంది' అని హిమాచల్‌ ప్రదేశ్ క్రికెట్‌ అసోసియేషన్ అధికారి ఒకరు తెలిపారు.ఇక మంగళవారం రాత్రి నుంచి ధర్మశాలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం కాస్త విరామం ఇచ్చిన వరుణుడు భారత ఆటగాళ్ల సాధన ముగియగానే మళ్లీ తన పని మొదలుపెట్టాడు. దీంతో గురువారం జరగాల్సిన భారత్, సౌతాఫ్రికా వన్డే మ్యాచ్‌పై కారుమబ్బులు నెలకొన్నాయి.కుండపోతగా వాన కురుస్తుండటంతో మైదానమంతా కవర్లతో కప్పేశారు. మ్యాచ్‌ జరిగే గురువారం సైతం 90 శాతం వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ రిపోర్ట్ బట్టి తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో ధర్మశాలలో భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్‌ బంతి పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు.